కన్ఫర్మ్‌.. పవన్‌ తర్వాత బన్నీకి ఇచ్చింది

anu emmanuel confirm as heroine in allu arjun naa peru surya naa illu india

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘నాపేరు సూర్య’. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు కథలు రాసిన వక్కంతం ఇప్పుడు సొంతంగా ఒక సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నాడు. చాలా సంవత్సరాలుగా వంశీ సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్‌తో ఈయనకు ఛాన్స్‌ వచ్చినట్లే వచ్చి మిస్‌ అయ్యింది. దాంతో బన్నీతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కు సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక పక్రియ దాదాపుగా పూర్తి అయ్యింది. 

ఈ చిత్రంలో బన్నీకి జోడీగా ఎవరు నటించబోతున్నారు అనే విషయమై పలు చర్చలు జరిగాయి. చివరకు ఈ సినిమాలో హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ నటించబోతున్నట్లుగా తేలిపోయింది. ప్రస్తుతం అనుఎమాన్యూల్‌ పవన్‌తో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తుంది. ఆ సినిమాలో అను ఎమాన్యూల్‌ చేస్తున్నది హీరోయిన్‌ పాత్రనా లేక హీరో పవన్‌కు చెల్లి పాత్రనా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. గోపీచంద్‌ సరసన ఈ అమ్మడు మరో సినిమాను చేసింది. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నానితో ఈమె చేసిన సినిమా సక్సెస్‌ అయ్యింది. ప్రస్తుతం అను ఎమాన్యూల్‌కు ఫుల్‌ క్రేజ్‌ ఉంది. దాంతో బన్నీ ఈమెను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దేశ భక్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా టైటిల్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ‘డీజే’ చిత్రం తర్వాత బన్నీ చేయబోతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
మరిన్ని వార్తలు

హీరోయిన్‌ విషయంలో పొరపాటు చేసిన గోపీచంద్‌

డ్రగ్స్‌ ఇష్యూపై రవితేజ తల్లి

డ్రగ్స్‌ జాబితాలో మెగా హీరో పేరు!