పూరి నోరు విప్పితే టాలీవుడ్‌ షేక్‌..!

puri jagannadh buying drugs from drug dealer kelvin

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ డ్రగ్స్‌ వాడుతాడు అనే నిర్థారణ జరిగిపోయింది. కెల్విన్‌ అనే డ్రగ్స్‌ డీలర్‌ వద్ద పూరి రెగ్యులర్‌ కస్టమర్‌గా తెలుస్తోంది. బ్యాంకాక్‌, థాయిలాండ్‌ వంటి దేశాల్లో బాగా ఎంజాయ్‌ చేసి పూరికి డ్రగ్స్‌ అలవాటు ఉన్నట్లుగా ముందు నుండే ప్రచారం జరుగుతుంది. ఆ మద్య నిర్మాత బండ్ల గణేష్‌ కూడా తానో డ్రగ్స్‌ బానిసతో సినిమా తీయాల్సి వచ్చింది అంటూ వాపోయిన విషయం తెల్సిందే. ఇక పూరి జగన్నాథ్‌ ఇండస్ట్రీలో ఎంతో మందికి డ్రగ్స్‌ అలవాటు చేశాడు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. తన సినిమాల్లో నటించిన పలువురికి పూరి స్వయంగా డ్రగ్స్‌ను ఇచ్చేవాడు అనేది కొందరి వాదన. 

ప్రస్తుతం ‘పైసా వసూల్‌’ చిత్రంతో బిజీగా ఉన్న దర్శకుడు పూరి త్వరలోనే పోలీసుల ముందు విచారణకు హాజరు కాబోతున్నాడు. ఆ విచారణలో భాగంగా పోలీసుల మీకు తెలిసిన వారు ఎవరైనా ఇండస్ట్రీలో డ్రగ్స్‌ తీసుకోవడం లేదా డ్రగ్స్‌ను సరఫర చేయడం మీకు తెలుసా అని ప్రశ్నించడం ఖాయం. అప్పుడు పూరి చెప్పే పేరు టాలీవుడ్‌ను షేక్‌ చేస్తాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. సెలబ్రెటీలు పలువురు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. అలాంటిది పూరి ఎవరెవ్వరు డ్రగ్స్‌ తీసుకుంటున్నారు అనే విషయాన్ని చెబితే వారంతా కూడా ఇరుక్కోవడం ఖాయం. అందుకే పూరిని నోరు ఎత్తకుండా ఉండేలా పువురు సెలబ్రెటీలు జాగ్రత్తలు పడుతున్నారు.

మరిన్ని వార్తలు

కన్ఫర్మ్‌.. పవన్‌ తర్వాత బన్నీకి ఇచ్చింది

హీరోయిన్‌ విషయంలో పొరపాటు చేసిన గోపీచంద్‌

డ్రగ్స్‌ ఇష్యూపై రవితేజ తల్లి