పూరీకి కిస్ ఇచ్చిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్

ramgopal varma kisses to puri jagannadh

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసిన అది సంచ‌ల‌న‌మే. ఆయన సినిమాల‌తోనే కాదు చేసే ప‌నుల‌తోను వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటాడు. కొద్ది రోజులుగా త‌న శిష్యుడు పూరీ జ‌గ‌న్నాథ్ చిత్రాన్ని తెరకెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాన్ని ప్ర‌మోట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్న వ‌ర్మ ఇప్పుడు ఆ స‌క్సెస్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. 2015లో వ‌చ్చిన టెంప‌ర్ చిత్రం త‌ర్వాత పూరీ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ఘ‌న విజ‌యం సాధించాడు. దీంతో టీంతో క‌లిసి వ‌రుస సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటున్నాడు. ఇందులో భాగంగా చిత్ర బృందంతో పాటు వ‌ర్మ‌కి కూడా పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో వ‌ర్మ త‌న శిష్యుడు పూరీ జ‌గ‌న్నాథ్ చెంప‌పై గ‌ట్టిగా ముద్దిచ్చాడు. ఈ స‌న్నివేశాన్ని చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించిన స‌త్య‌దేవ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్‌ఎక్స్‌ 100 ఫేం అజయ్‌ భూపతి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ఫేం అగస్త్య మంజులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల ఆట చూడటానికి ముసాపేట శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూడబోతున్నా. థియేటర్‌కు మాస్‌ గెటప్‌లో బైక్‌పై వెళ్లనున్నాం అంటూ కొద్ది సేప‌టి క్రితం ట్వీట్ చేశారు వర్మ. మ‌రి ఆ థియేట‌ర్‌లో వ‌ర్మ ఎంత‌టి హంగామా చేస్తాడో చూడాలి.