మ‌న్మ‌థుడు 2 డైరెక్ట‌ర్‌ని ఆటపట్టించిన నాగార్జున‌

nagarjuna prank manmadhudu 2 director

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున న‌టించిన తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. చిల‌సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇందులో భాగంగా నాగ్ త‌న చిత్ర ద‌ర్శ‌కుడిని ఆట‌ప‌ట్టించాడు. రెస్టారెంట్‌కి వెళ్లి అక్క‌డికి వ‌చ్చిన వారితో తాను చెప్పినవ‌న్ని చేయాల‌ని సూచించాడు. నాగ్ చెప్పిన‌ట్టు రాహుల్ రవీంద్ర‌న్ అలానే చేసాడు. కాస్త అణుకువ‌తో భ‌య‌ప‌డుకుంటూ రాహుల్ రవీంద్ర‌న్ ప్ర‌ద‌ర్శ‌న‌ ఆక‌ట్టుకుంటుంది. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌తో పాటు రెస్టారెంట్‌లో జ‌రిగిన ఫ‌న్ నెటిజ‌న్స్‌కి మంచి వినోదం పంచుతుంది. మీరు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఫ‌న్ రైడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ పెళ్ళికాని మ‌ధ్య వ‌య‌స్కుడిగా అలరించ‌నున్నాడు.