రెండు రోజుల‌లో 25 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టిన ఇస్మార్ట్ శంక‌ర్

ismart shankar world wide gross rs 25 crores in two days

పూరీ జ‌గ‌న్నాథ్‌, రామ్ పోతినేని కాంబినేష‌న్‌లో రూపొందిన మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. జూలై 18న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజులకి గాను 25 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టింద‌ని టీం చెబుతుంది. పూరి మార్క్ హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏవి లేక‌పోవ‌డంతో ఇస్మార్ట్ శంక‌ర్ భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రాన్ని టూరింగ్‌ టాకీస్‌, పూరి కనక్ట్‌ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.