స్పీడు పెంచిన బ‌న్నీ.. మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్

director boyapati srinu next with allu arjun

అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నాడు. మ‌రో వైపు వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ అనే చిత్రం చేస్తున్నాడు బ‌న్నీ. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోను బ‌న్నీ ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇప్ప‌టికే మూడు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న బ‌న్నీ తాజాగా బోయ‌పాటి శీను సినిమాకి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. బోయ‌పాటి గ‌తంలో గీతా ఆర్ట్స్ బేన‌ర్‌లో ఓ చిత్రం చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అల్లు అర‌వింద్ నిర్మాణంలో మంచి స‌బ్జెక్ట్‌తో ఆ చిత్రం ఉంటుంద‌ని తెలియ‌జేశాడు. ఆ చిత్రంలో బన్నీనే హీరో అనే టాక్స్ వినిపిస్తున్నాయి. గ‌తంలో బోయ‌పాటి, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వచ్చిన స‌రైనోడు చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో త‌దుపరి ప్రాజెక్ట్‌పై కూడా అంచనాలు భారీగానే ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది.