సోమరాజు తోలు బొమ్మలాట!

tholu bommalaata first look

డా॥ రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం తోలు బొమ్మలాట. విశ్వనాథ్ మాగంటి దర్శకుడు. సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై దుర్గా ప్రసాద్ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం శుక్రవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ జీవితం అంటేనే ఓ తోలుబొమ్మలాట.ఎవరి ఆటను వాళ్లు ఆడితీరాల్సిందే. కాకపోతే కొన్నిసార్లు ఈ ఆటలో చిక్కుముడులుంటాయి. వాటిని ఎంత అందంగా విప్పగలిగాం? మన వారిని వాటి నుంచి ఎంత గొప్పగా విడిపించగలిగాం అనేది ఆసక్తికరంగా వుంటుంది.

అలాంటి అద్భుతమైన కథతో విశ్వనాథ్ మాగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదొక విభిన్నమైన కుటుంబ కథా చిత్రం. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కామెడీ, కుటుంబ విలువలు, భావోద్వేగాలు.. ఇలా అన్ని అంశాలుంటాయి. మంచి చిత్రాన్ని నిర్మించామన్న సంతృప్తినిచ్చింది అన్నారు. దేవిప్రసాద్, నర్రా శ్రీనివాస్, నారాయణరావు, సంగీత, కల్పన, శిరీష, చలపతిరావు, ప్రసాద్‌బాబు, ధన్‌రాజ్, పూజా రామచంద్రన్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.