కాకినాడ వెళ్ళి మరీ విజయ్ కి కథ చెప్పాడట

puri jagannadh next movie with vijay devarakonda

డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలంగా వరస ప్లాప్స్ తో సతమత మవ్వుతున్నాడు. ఆ మద్య తన కొడుకు ఆకాష్ ను హీరోగా మెహబూబా చిత్రం తీసి పరాజయం పాలు అయ్యాడు. మరో చిత్రం చెయ్యడానికి పురిజగన్నాధ్ కి వన్ ఇయర్ టైం పట్టింది. మరో సినిమా ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. పూరి ఓ సరికొత్త కథ పట్టుకొని యంగ్ హీరో విజయ్ దేవరకొండ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాడు. విజయ్ కి ఇప్పుడు యూత్ లో యమ క్రేజీ ఉన్నది కావున, విజయ్ తో ఓ సినిమా తీసి మరల ట్రాక్ లోకి రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఇప్పటికే ఓ మూడు ప్రాజెక్ట్స్ చేతిలో సిద్దంగా ఉన్నాయి.

ఆల్రెడీ డియర్ కామ్రేడ్ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో పూరికి విజయ్ డేట్స్ దొరకడం లేదు అందుకనే పురినే విజయ్ దేవరకొండ షూటింగ్ సెట్స్ వెళ్ళాడని అతని సన్నిహితుల ద్వార తెలుస్తుంది. విజయ్ డియర్ కామ్రేడ్ కాకినాడలో షూటింగ్ జరుపుకుంటుంది. పూరి అక్కడకు వెళ్లి కథను వినిపించడంట. దూరదర్శన్ లోని సీరియల్ కి పనిచేసేటపుడు విజయ్ తండ్రి గోవర్ధన్ రావు తో పురికి మంచి పరిచయం ఉన్నదంట. అందుకే పూరి అటునుండి నరక్కుంటూ వస్తున్నాడు. పూరి ఎలాగైనా విజయ్ తో ఓ సినిమా చెయ్యాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. పూరి మరో సినిమాగా రామ్ తో ఓ సినిమా చేయ్యనున్నాడు.