పూరి మాయలో పడ్డ నాగార్జున!

nagarjuna next movie with puri jagannadh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌కు గత కొంత కాలంగా గడ్డు కాలం నడుస్తుంది. టాలీవుడ్‌ టాప్‌ దర్శకుల్లో ఒక్కడిగా నిలిచి, అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుల జాబితాలో నిలిచాడు. కాని ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గత కొంత కాలంగా ఈయన చేస్తున్న ఏ ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా సక్సెస్‌ అవ్వక పోవడంతో ఈయనతో నటించేందుకు హీరో ఆసక్తి చూపడం లేదు. ఇటీవలే ఈయన కొడుకు ఆకాష్‌ పూరితో ‘మెహబూబా’ చిత్రాన్ని చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమాను స్వయంగా నిర్మించిన పూరి భారీ నష్టాలపాలయ్యాడు. ఈదెబ్బకు పూరికి ఇక ఛాన్స్‌లు రావని అంతా భావించారు. కాని అనూహ్యంగా నాగార్జునతో ఈయన ఓకే చెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున హీరోగా పూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ‘సూపర్‌’ మరియు ‘శివమణి’ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. రెండు కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి. తాజాగా మరో మంచి కథను నాగార్జునకు పూరి వినిపించాడని, లిమిటెడ్‌ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానంటూ నాగార్జునకు పూరి హామీ ఇవ్వడంతో వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నానితో మల్టీస్టారర్‌ చేస్తున్న నాగార్జున ఆ తర్వాత ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘మెహబూబా’ పూర్తి అయిన వెంటనే తన కొడుకుతోనే మరో సినిమాను చేస్తానంటూ ప్రకటించిన పూరి ఇప్పుడు మనసు మార్చుకుని నాగార్జునతో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. అయితే అక్కినేని ఫ్యాన్స్‌ మాత్రం నాగార్జున నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.