పూరికి నాని కూడా హ్యాండ్‌ ఇచ్చాడు

Nani Gives Clarity on About Movie With Director Puri

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ తీవ్రమైన కష్టాల్లో ఉన్నాడు. ఈయన చేసిన వరుస చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు ఏ ఒక్క హీరో మరియు నిర్మాత కూడా ఆసక్తిగా లేరు. దాంతో ప్రస్తుతం పూరి సొంత బ్యానర్‌లోనే సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు. నాని హీరోగా పూరి దర్శకత్వంలో ఒక చిత్రం రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అంటూ హీరో నాని క్లారిటీ ఇచ్చేశాడు. తాను ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాలు పూర్తి అయ్యే వరకు మరో ఇతర సినిమాలకు ఓకే చెప్పను అంటూ నాని చెప్పుకొచ్చాడు. 

నాని హీరోగా ప్రస్తుతం శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంలో నాగార్జునతో పాటు నాని నటిస్తున్నాడు. మల్టీస్టారర్‌ చిత్రం చేస్తున్న నాని మరో వైపు బిగ్‌బాస్‌ను కూడా చేస్తున్న విషయం తెల్సిందే. ఇవి కాకుండానే గౌతమ్‌ దర్శకత్వంలో ‘జర్సీ’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. పు చిత్రాతో బిజీగా ఉన్న నాని ప్రస్తుతానికి పూరితో సినిమా చేయడం లేదని తేలిపోయింది. దాంతో మరోసారి పాపం పూరి అంటూ కొందరు ఆయనపై జాలి చూపుతున్నారు. అంతా కొత్త వారితో పూరి ఒక సినిమాను ప్లాన్‌ చేయాలనుకుంటున్నాడు అంటూ కొత్త పుకారు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూరి మళ్లీ మునుపటి క్రేజ్‌ను దక్కించుకుంటాడా లేదా అనేది చూడాలి.