చికాగో టాలీవుడ్‌ సెక్స్‌ రాకెట్‌లో మరో నిర్మాత!

another producer in Chicago Tollywood sex racket

తెలుగు సినిమా పరిశ్రమను షేక్‌ చేస్తున్న చికాగో సెక్స్‌ రాకెట్‌ ఉదంతంలో కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు నెలలుగా ఎంక్వౌరీ చేస్తున్న పోలీసులకు పలువురి పేర్లు తెలిశాయి. వారి నుండి పలు ఆసక్తికర అంశాలను మరియు కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో టాలీవుడ్‌కు చెందిన ఒక నిర్మాత ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉండే ఆ నిర్మాత చిన్న హీరోయిన్స్‌ నుండి పెద్ద హీరోయిన్స్‌ వరకు అందరితో చక్కని పరిచయంను పెంచుకున్నాడు. వారితో డీలింగ్స్‌ చేయడం, వారి షోను నిర్వహించడం చేస్తూ ఉంటాడు. అమెరికాకు ఏ హీరోయిన్‌ అయినా వెళ్లాలి అంటే ఈయన ఆ ఏర్పాట్లు చేస్తాడని సమాచారం అందుతుంది.

త్వరలోనే ఆ నిర్మాత గురించిన పూర్తి వివరాలను అమెరికా పోలీసులు తెలుసుకోబోతున్నారు. గత కొంత కాలంగా మీడియాలో సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లినట్లుగా సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాదాపు 15 మందిని ఆ నిర్మాత అమెరికాకు పంపించాడనే టాక్‌ వినిపిస్తుంది. ఈవెంట్స్‌ పేరుతో ఆయన ఇతర రాష్ట్రాలకు కూడా హీరోయిన్స్‌ను పలు సందర్బాల్లో తీసుకు వెళ్లాడు. దాదాపు పది సినిమాలను నిర్మించిన ఆ నిర్మాతను పోలీసులు త్వరలోనే అదుపులోకి తీసుకుంటారనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ నిర్మాత పేరు మాత్రం సస్పెన్స్‌గా ఉంది. కొన్ని రోజుల్లో ఆయన ఎవరు, ఏంటీ అనే విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.