సురేష్‌ ప్రొడక్షన్స్‌కే మరోటి

One More Movie For Suresh Productions

‘పెళ్లి చూపులు’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న తరుణ్‌ భాస్కర్‌ తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాను సురేష్‌బాబు నిర్మించిన విషయం తెల్సిందే. పెళ్లి చూపులు చిత్రానిన సురేష్‌బాబు నిర్మించాడు. ఆ చిత్రంతో భారీగా లాభాలను దక్కించుకున్న సురేష్‌బాబు వెంటనే తరుణ్‌ భాస్కర్‌కు రెండు సినిమాలకు గాను అడ్వాన్స్‌లను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని చేశారు. తాజాగా మరో సినిమాకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ నగరానికి ఏమైంది చిత్రం ప్రెస్‌ మీట్‌ను నిర్వహించడం జరిగింది.

ఆ ప్రెస్‌మీట్‌లో తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. ఒక మంచి నిర్మాణ సంస్థతో వర్క్‌ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ చిత్రాన్ని నేను అనుకున్నట్లుగా చేయడంలో హెల్ప్‌ చేసిన నిర్మాత సురేష్‌బాబుకు కృతజ్ఞతలు అన్నాడు. తాను మరో సినిమాను కూడా సురేష్‌ ప్రొడక్షన్స్‌లో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రం విడుదల అయిన నెల రోజుల్లో సురేష్‌ ప్రొడక్షన్స్‌లో మరో సినిమాను తరుణ్‌ భాస్కర్‌ ప్రారంభించబోతున్నాడు. ఒకే నిర్మాణ సంస్థలో ఒక దర్శకుడు వరుసగా చిత్రాలను చేయడం చాలా అరుదు. తరుణ్‌ భాస్కర్‌ ఏకంగా మూడు సినిమాలను సురేష్‌ ప్రొడక్షన్స్‌లో చేస్తుండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఈనగరానికి ఏమైంది చిత్రం సక్సెస్‌ అయితే ఈయన స్టార్స్‌తో సినిమాను చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.