“ఈగిల్” తో మాస్ మహారాజ హిట్ కి సిద్ధం అయ్యాడా ?

“ఈగిల్” తో మాస్ మహారాజ హిట్ కి సిద్ధం అయ్యాడా ?
Cinema News

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ చివరిసారిగా టైగర్ నాగేశ్వర రావు మూవీ లో కనిపించారు. ఈ మూవీ లో రవితేజ మేకోవర్, పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ, మూవీ మాత్రం ఆడియెన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తో సూర్య వర్సెస్ సూర్య మూవీ ను డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని తో రవితేజ ఈగిల్ మూవీ ని చేశారు. ఈ మూవీ పై మాస్ మహారాజ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

“ఈగిల్” తో మాస్ మహారాజ హిట్ కి సిద్ధం అయ్యాడా ?
“ఈగిల్” తో మాస్ మహారాజ హిట్ కి సిద్ధం అయ్యాడా ?

ఇటీవల స్పెషల్ షో కి రవితేజ తన రివ్యూ ని కూడా అందించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార సినిమా లకి, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ లో నవదీప్, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించడం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ కి దావ్ జంద్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 9 న థియేటర్ల లో తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.