AP Budget 2024: బడ్జెట్ లో సంక్షేమానికే పెద్ద పీట: ఆర్ధిక మంత్రి బుగ్గన

AP Budget 2024: Major emphasis on welfare in the budget: Finance Minister Buggana
AP Budget 2024: Major emphasis on welfare in the budget: Finance Minister Buggana

బడ్జెట్ లో సంక్షేమానికే పెద్ద పీట వేసినట్లు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన తెలిపారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతులతో కేబినెట్ సమావేశానికి చేరుకున్న బుగ్గన..అనంతరం మాట్లాడారు.

మ్యానిఫెస్టో ను పవిత్ర గ్రంథం గా భావించిన రాజకీయ పార్టీ వైసీపీ, రాజకీయ నాయకుడు జగన్ అని కొనియాడారు. 99 శాతం హామీలను శాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేశామని…ఇలా అమలు చేయటంలో జగన్ విధానాలే ఇతర రాజకీయ పార్టీలకు ఒక బెంచ్ మార్క్ అయ్యిందన్నారు.

కోవిడ్ లేకపోతే అభివృద్ధి కి మరింత అవకాశం ఉండేదని…కొన్ని పరిమితులు ఉన్నాయని వివరించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. గత ఐదేళ్ళల్లోనూ వైద్యం, విద్యా, వ్యవసాయం, మహిళా, వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని..రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పన పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర సానుకూల సంబంధాల ద్వారా పరిష్కర దిశగా తీసుకుని వచ్చామని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన తెలిపారు.