“టిల్లు స్క్వేర్” గ్లింప్స్ రిలీజ్ ..!

“టిల్లు స్క్వేర్” గ్లింప్స్ రిలీజ్ ..!
Cinema News

డీజే టిల్లు తో ఆడియెన్స్ ని సూపర్ గా ఎంటర్ టైన్ చేశారు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈ మూవీ కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ని మార్చ్ 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నేడు సిద్దు జొన్నలగడ్డ పుట్టిన రోజు సందర్భంగా, గ్లింప్స్ వీడియో ని నేడు సాయంత్రం 6:03 గంటలకి రిలీజ్ చేయనున్నారు.

ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. మూవీ నుండి రిలీజైన ప్రచార మూవీ కి, పాటలకి ఆడియెన్స్ నుండి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ అప్డేట్ తో అందరిలో మరింత ఆసక్తి నెలకొన్నది . సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ మూవీ స్ బ్యానర్ లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.