ఆ నలుగురు నచ్చలేదట

ntr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘బిగ్‌బాస్‌’ షో ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా దుమ్ము దులిపేశాడు. మొదటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌ను పరిచయం చేసి వారిని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎన్టీఆర్‌ జాయిన్‌ చేసి వెళ్లి పోయాడు. వారం రోజుల తర్వాత అంటే శనివారం నాడు ఎన్టీఆర్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఇక ఈ వారం రోజులు ఆ 14 మంది పార్టిసిపెంట్స్‌ ఏం చేస్తారు, ఎలా ప్రవర్తిస్తారు అనేది ప్రతి రోజు ప్రేక్షకులు రాత్రి 9.30 గంటలకు చూడవచ్చు. తెలుగులో ఈ షోను స్టార్‌ మాటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేస్తుంది. అయితే ఈ షోలో నలుగురు పార్టిసిపెంట్స్‌ మైనస్‌ అంటూ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. సోషల్‌ మీడియాలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

వివాదాస్పదురాలు మరియు అందాలను ఏమాత్రం దాచుకోకుండా ప్రదర్శించే ముద్దుగుమ్మ ముమైత్‌ ఖాన్‌ ఈ షోకు మైనస్‌ అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈమెను చూసేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆమె బాడీ లాంగ్వేజ్‌ మరియు ఆమె తీరు కాస్త అడల్ట్‌ కంటెంట్‌ తరహలో ఉందని అంటున్నారు. ఇక మరో పార్టిసిపెంట్‌ జ్యోతిపై కూడా వివాదాలున్నాయి. గతంలో ఈమె బ్రోతల్‌ కేసులో అరెస్ట్‌ అయ్యింది. ఈమె స్థానంలో మరెవ్వరినైనా ఎంపిక చేసి ఉంటే బాగుండేది. ఇక ఫిల్మ్‌ క్రిటిక్‌ మహేష్‌ కత్తి కూడా షోలో హైలైట్‌ కాలేక పోవచ్చు అంటున్నారు. ఈయన సెలబ్రెటీ కాకపోవడంతో పాటు, ఆయన ఉత్సాహంగా బిగ్‌బాస్‌ షోలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వలేక పోవచ్చు. ఇక చివరిగా మధుప్రియను కూడా ప్రేక్షకులు కొందరు నిరాకరిస్తున్నారు. ఆమె చిన్నమ్మాయి అని, ఆమె స్థానంలో మరెవ్వరినైనా తీసుకుని ఉంటే బాగుండేది అనేది కొందరి వాదన. ఈ నలుగురు ప్రేక్షకుల్లో కొందరిని నచ్చలేదు. నచ్చినా, నచ్చక పోయినా కూడా వారు ఇప్పుడు బిగ్‌బాస్‌ షోలో కొనసాగుతున్నారు. కనుక ప్రేక్షకులు వారిని భరించి తీరాల్సిందే.

మరిన్ని వార్తలు

నాని ఖాతాలో మెగా హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డు

మొదటి ఎపిసోడ్‌లోనే షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌