మొదటి ఎపిసోడ్‌లోనే షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

jr-ntr-is-give-shock-from-the-first-episode-of-bigg-boss

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత రెండు నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ షో ప్రారంభం అయ్యింది. 70 రోజుల పాటు బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉండబోతున్నది ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. పార్టిసిపెంట్స్‌ అంతా కూడా లోనికి వెళ్లారు. బిగ్‌ బాస్‌ షోను స్టార్‌ మాటీవీ అధికారికంగా ప్రకటించినప్పటి నుండి కూడా\star  60 కెమెరాలు, 70 రోజులు అంటూ ఒకటే ప్రచారం చేస్తూ ఉంది. అయితే షో ప్రారంభం రోజే ఆశ్చర్యకర విషయం ఒకటి చోటు చేసుకుంది. అదే పార్టిసిపెంట్ల సంఖ్య. 12 మంది అంటూ ప్రచారం చేసిన స్టార్‌ మా వారు చివరకు 14 మందిని లోనికి పంపించడం జరిగింది.

ఎన్టీఆర్‌ 12 మంది పేర్లు పిలిచిన తర్వాత ఇంతటితో ఆగిపోతుందని అంతా భావించారు. షాకింగ్‌గా 13వ వ్యక్తిగా ఆదర్ష్‌ను ఆ తర్వాత 14వ వ్యక్తిగా ధన్‌రాజ్‌ను పిలవడం జరిగింది. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. బాగ్‌బాస్‌ హౌస్‌లో మరో ఇద్దరు పెరగడంతో ఖచ్చితంగా మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను తెలుగు ప్రేక్షకులు మరియు సినీ సెలబ్రెటీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ 70 రోజుల్లో వారంకు ఒక్కరు చొప్పున ఎలిమినేట్‌ అవుతూ వస్తారని తెలుస్తోంది. మొదటి ఎపిసోడ్‌ మొత్తం పార్టిసిపెంట్ల పరిచయ కార్యక్రమం జరిగింది. ఇక నేటి నుండి అసలు బిగ్‌ బాస్‌ హౌస్‌ షో ప్రారంభం కాబోతుంది.

మరిన్ని వార్తలు:

నాని ఖాతాలో మెగా హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డు

‘బిగ్‌బాస్‌’ 1వ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌ ఇచ్చే సర్‌ప్రైజ్‌ ఏంటో తెలుసా?