బిగ్‌బాస్‌ నుండి అమిత్‌ ఔట్‌…!

Amit Tiwari Eliminated From Bigg Boss House

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగింపుకు చేరుకుంది. పెద్ద ఎత్తున విమర్శలు, టీఆర్పీతో ఈ షోకు దూసుకు పోతుంది. తాజాగా నిన్నటి ఆదివారం రోజున ఈ షో నుండి అమిత్‌ ఎలిమినేట్‌ అవ్వడం జరిగింది. ఎలిమినేషన్‌లో ఉన్న అమిత్‌కు అందరికంటే తక్కువ ఓట్లు పడ్డట్లుగా మా వర్గాల నుండి తెలుస్తోంది. అమిత్‌ గత రెండు వారాలుగా బిగ్‌బాస్‌ నిర్వాహకుల ద్వారా సేవ్‌ అవుతూ వస్తున్నాడు. ఎట్టకేలకు బిగ్‌ బాస్‌ నుండి అమిత్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌లో అమిత్‌ చాలా సేఫ్‌ గేమ్‌ ప్లే చేశాడు. అయినా కూడా అమిత్‌ ఔట్‌ అయ్యాడు.

bigboss-amith

గత రెండు వారాలుగా నూతన్‌ నాయుడు మరియు శ్యామలల కారణంగా అమిత్‌ ఎలిమినేషన్స్‌ తప్పించుకుంటూ వస్తున్నాడు. నూతన్‌ నాయుడుకు అమిత్‌ కంటే చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయట. అయినా కూడా అమిత్‌ను ఉంచి నూతన్‌ నాయుడును ఎలిమినేట్‌ చేయడం జరిగింది. ఆ తర్వాత వారం శ్యామల విషయమలో కూడా అమిత్‌ సేవ్‌ అయ్యాడు. నూతన్‌ నాయుడు మరియు శ్యామలలు రీ ఎంట్రీ ఇచ్చిన కారణంగా వారిని ఫైనల్‌ వరకు ఉంచడం భావ్యం కాదనే ఉద్దేశ్యంతో ఓట్లతో సంబంధం లేకుండా బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌ నిర్ణయం తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. భారీ ఎత్తున బిగ్‌బాస్‌ షో పై ట్రోల్స్‌ వస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు జాగ్రత్తలు పడుతున్నారు.

big-boss-elemanate-amith