అరవింద సమేత ఆడియోపై ఎట్టకేలకు క్లారిటీ…!

Aravindha Sametha Audio Launched On September 20th

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం ఆడియో విడుదలపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెర పడ్డట్లయ్యింది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను ఈనెల 20న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడినది. మొన్నటి వరకు ఆడియో వేడుకకు ఆ గెస్ట్‌, ఈగెస్ట్‌ అంటూ వార్తలు వచ్చాయి, ఆ తర్వాత ఆడియో విడుదల కార్యక్రమం లేకుండా నేరుగానే పాటలను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఆడియో విడుదల తేదీ ప్రకటించడంతో పాటు, అధికారికంగా క్లారిటీ ఇచ్చిన కారణంగా ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

aravindh-sameetha-trivikram

అరవింద సమేత చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఇక నందమూరి అభిమానులు ఈ చిత్రం కోసం వెయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ జరుపుతున్నారు. త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల చేసేందుకు నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆడియో విడుదల కార్యక్రమంలో గెస్ట్‌ గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. అందుకు సంబంధించిన గెస్ట్‌ ఎవరు అయ్యి ఉంటారు అంటూ అభిమానులు ఆలోచనల్లో ఉన్నారు.

aravindha-sametha-ntr