పరువు హత్యలు పైన మండిపడ్డ హీరో రామ్…!

Hero Ram Twitted In Intercaste Marriage

మిర్యాల గూడకి చెందిన ప్రణయ్, అమృతల విషాదం అందరిని కలిచి వేసింది. రాష్ట్రం నలుమాలలు నుండి ప్రజలు అందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు, అటు రాజకీయ నాయకులూ, సినీ ప్రముఖులు ఈ హత్యని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నారు. ఇంకెప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని అందరిలోనూ కులం అనే భావనలు ఉండకూడదు అని అందరూ భావిస్తున్నారు. తాము ప్రేమ వివాహం ఒద్దంటున్న చేసుకున్నది అనే కక్ష్యతో అమ్మాయి తండ్రి ఆమె భర్తని హత్య చేయించిన సంఘటన పెద్ద కలకలం రేపింది. దీని పై ఇటు సోషల్ మీడియా లోని, ప్రజా వేదిక లలోను తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీని గురించి రాజకీయ నాయకులు సినీ తారలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.

ram-inteercast

ఈ సంఘటన పై హీరో రామ్ ట్విట్టర్ లో స్పందించారు. సెక్షన్ 377 కూడా ఎత్తేసారు ఇంకా కులాలుని పట్టుకొని వేలాడటం, కులం పేరుతో హత్యా లు చెయ్యడం ఏమిటిరా జంగల్ ఫెలోస్ అని తనదైన శైలి లో ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. ఎలాంటి కుల బేధాలు లేకుండా మనిషిగా బ్రతకండి నేర్చుకోండి అని సూచించాడు. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా మన వయిపు నుండే చైతన్యం రావాలని అందరి పేరు చివరిలలో తోకలు కత్తరించాలని అని తన సోషల్ మీడియా లో పేరుకొంది.

ram
తెలంగాణ ఇట్ శాఖ ముఖ్యమంత్రి కేటిర్ కూడా దీని పై స్పందించారు , ఈ హత్యా నన్ను షాక్ కి గురి అయ్యాను అని, తీవ్రం గా కలచి వేసింది అని అన్నారు, మన దేశం లో కులం అనేది ప్రజలలో ఎంతలోతులలో ఉన్నదీ అన్నదానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అన్నారు, హంతకులని ఎట్టి పరిస్థితులలో శిక్షించాలి అని, బాధితులకు న్యాయం జరగాలని అన్నారు. ప్రణయ్ భార్య అమృతకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కెటిర్ ట్వీట్ చేసారు.