ఈవారం ఎలిమినేట్‌ ఎవరో తేలిపోయింది

Deepthi To Be Out Of Big boss House This Week

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో అప్పుడే పది వారాలు పూర్తి అయ్యాయి. మొదట కాస్త మెల్లగా సాగిన బిగ్‌బాస్‌ వారాలు గడుస్తున్నా కొద్ది, ఎలిమినేషన్స్‌ జరుగుతున్నా కొద్ది ఆసక్తి పెరుగుతూ వస్తుంది. తాజాగా ఈ వారంలో ఎలిమినేషన్స్‌ మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ వారంలో ఎలిమినేషన్‌లో నలుగురు ఉన్నారు. కౌశల్‌, తనీష్‌, దీప్తి, పూజాలు ఎలిమినేషన్స్‌కు నామినేట్‌ అయ్యారు. ఈ నలుగురిలో బలహీనమైన పార్టిసిపెంట్‌ అంటే ఖచ్చితంగా టీవీ9 దీప్తిగా చెప్పుకోవచ్చు. గత కొన్ని వారాలుగా ఈమె నెట్టుకు వస్తుంది. ఎలిమినేషన్స్‌లో ఉన్న సమయంలో ఈమె ప్రవర్తన పీక్స్‌లోకి వెళ్తుంది. ఈమె ప్రదర్శణ భారీ స్థాయిలో ఉంటుంది. ఇక ఎలిమినేషన్స్‌లో లేని సమయంలో సాదా సీదాగానే వ్యవహరిస్తుంది.

 tv9 deepthi

ఈవారం ఎలిమినేషన్స్‌లో ఉన్న కౌశల్‌ ఖచ్చితంగా తన ఆర్మీ కారణంగా బయట పడిపోతాడు. ఇక తనీష్‌ కూడా ఏదో ఒక కారణంతో సేవ్‌ అవుతాడు. మిగిలి ఉన్న ఇద్దరు ఆడవారు పూజా రామచంద్రన్‌ మరియు దీప్తిలో బలహీనమైన పార్టిసిపెంట్‌ అంటే ఖచ్చితంగా దీప్తి అని అంతా అంటున్నారు. గత వారంలోనే దీప్తి ఎలిమినేట్‌ అయిపోయే అవకాశం ఉండేది. కాని ఆ వారం నామినేషన్స్‌లో లేకపోవడం ఆమెకు కలిసి వచ్చింది. ఇక దీప్తి గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రవర్తన కలిగి ఉంటుంది. అందుకే ఆమెకు ఈ వారం ఎలిమినేషన్‌ తప్పదు అంటూ బిగ్‌బాస్‌ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు అంటున్నారు. కౌశల్‌తో పాటు తనీష్‌కు మంచి ఓట్లు వస్తాయి. పూజా కూడా స్ట్రాంగ్‌ పార్టిసిపెంట్‌ కనుక ఖచ్చితంగా పూజాకు ఓట్లు దక్కే అవకాశం ఉంది. కాని దీప్తి మాత్రం ఈసారి గెటిన్‌ అవ్వడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు.

deepthi