బిగ్‌బాస్‌ : ప్రారంభం అయిన ఫైనల్‌ పోరు

ntr-telugu-bigg-boss-show-started-then-final-match

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన తెలుగు బిగ్‌బాస్‌ షో ఆసక్తికరంగా సాగుతూ ఉంది. 10 వారాల బిగ్‌బాస్‌ షోలో 9 వారాలు పూర్తి అవ్వడంతో షో క్లైమాక్స్‌కు చేరింది. ఈ వారంలో ఫైనల్‌ విజేత ఎవరో తేలిపోనుంది. తాజాగా ఇంటి నుండి దీక్ష బయటకు వచ్చేయడంతో ప్రస్తుతం ఇంట్లో శివబాలాజీ, నవదీప్‌, ఆదర్ష్‌, అర్చన, హరితేజ అయిదుగురు ఉన్నారు. ఈ అయిదుగురిలో ఈ వారం ప్రేక్షకులు ఎక్కువగా ఎవరికి ఓట్లు వేస్తే వారే బిగ్‌బాస్‌ ఫైనల్‌ విన్నర్‌.

ఇంట్లోకి 16 మంది వెళ్లగా ఇప్పటి వరకు 10 మంది ఎలిమినేషన్‌ ద్వారా బయటకు రాగా, సంపూర్నేష్‌బాబు ఎలిమినేషన్‌ కాకుండానే బయటకు వచ్చేశాడు. గత 9 వారాలుగా సాగుతున్న ఈ బిగ్‌బాస్‌ షోను తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆధరిస్తూనే ఉన్నారు. కొన్ని ఎపిసోడ్‌లు బోరింగ్‌గా అనిపించినా ఎక్కువ ఎపిసోడ్‌లు ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచాయి. దాంతో స్టార్‌ మాటీవీ నెం.1 స్థానంకు చేరుకుంది. బిగ్‌బాస్‌ షోకు తాజాగా కాల్‌ చేసిన సరయు అనే ఒక ప్రేక్షకురాలు షో అయిపోతుంది అంటే బాధగా ఉందని, ఇంకొన్నాళ్లు ఉంటే బాగుండేదని, ప్రతి రోజు ఇక రాత్రి ఏం చేయాలో ఇప్పటి నుండే మాలో టెన్షన్‌ ప్రారంభం అయ్యింది అంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటలు చాలా తెలుగు ప్రేక్షకులు బిగ్‌బాస్‌ షోను ఏ స్థాయిలో ఆధరించారు, ఆధరిస్తున్నారు అని చెప్పడానికి. మొదటి సీజన్‌ పూర్తి అయిన కొన్నాళ్లకే రెండవ సీజన్‌ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.