షూట్ లో యాక్సిడెంట్…హీరోకి తీవ్ర గాయాలు !

బాలీవుడ్ మూవీ యురి ది సర్జికల్ స్ట్రైక్ ఎంత బాగా ఆడిందో అందరికీ తెలుసు. ఈ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో విక్కీ కౌశల్ లేటెస్ట్‌గా ‘ఉధమ్ సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు భాను ప్రతాప్ సింగ్ డైరెక్షన్‌లో గుజరాత్ అనే మరో హారర్ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగా యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఓ భారీ డోర్ విక్కీపై పడిందట. దీంతో అతని దవడ ఎముక విరిగింది. వెంటనే విక్కీని ఫస్ట్ ఎయిడ్ కోసం ఓ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం ఆయన్ను ముంబై ఆసుపత్రికి తరలించగా ఆయనకు అక్కడ 13 కుట్లు పడ్డట్లు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.