టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట తీవ్ర విషాదం…ఆత్మహత్య !

టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్‌ లో ఆయన మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అమీర్ పెతల్ని నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ధర్మారామ్ గురువారం రాత్రి ప్రకటించిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో ఏడో ఫ్లోర్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇటీవల విడుదలయిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలవడంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫలితాలు చూసుకున్న తర్వాత ధర్మారామ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తాము నివసిస్తున్న ఏడంతుస్తల భవనం పై నుంచి దూకాడు. అయితే నిన్న సాయంత్రమే జరిగినా ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.