మజిలీ డిలీటెడ్ సీన్లు…గుండెలు పిండుతున్నారుగా ?

మజిలీ సినిమాతో సమంత, నాగ చైతన్యల జోడీ మరో హిట్ కొట్టారు. అయితే విడుదలయి రెండో వారం దగర్కి వస్తున్నా సిన్మా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే సినిమా యూనిట్ కూడా సినిమాని ప్రేక్షకులకు మరిన్య్హ చేరువ చేసేందుకు విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నిడివి దృష్ట్యా ఈ చిత్రం నుండి తొలగించిన సీన్లను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా నాగ చైత‌న్య‌, సుబ్బరాజుకి మ‌ధ్య సాగిన ఎమోష‌న‌ల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో నాగ చైత‌న్య‌ని పొడ‌వాల‌ని నెయిల్ క‌ట్ట‌ర్‌తో సుబ్బ‌రాజు రెడీగా ఉంటారు. కాని చైతూ ఇచ్చిన హ‌గ్‌కి సుబ్బ‌రాజులో మార్పు వ‌స్తుంది. ఈ సీన్ చాలా సినిమాటిక్‌గా ఉంద‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు.

ఇక తాజాగా ఈరోజు సమంత, నాగ చైతన్యలతో పాటు పోసాని, రావురమేష్ కాంబినేషన్‌లో ఉన్న ఈ సీన్‌లో పోసాని క్రిష్ణ మురళి తాను ఏడుస్తూ ప్రేక్షకుల్ని ఏడిపించే ప్రయత్నం చేశారు. భోజనం చేయడానికి సమంతతో కలిసి తన అత్త గారికి ఇంటికి వెళ్లి తన మామ పోసానిని మీరు తినండి మామయ్య అని అని నాగ చైతన్య అనడం దానికి ఎమోషన్ అయిన పోసాని ఆనందంతో ‘మీరు మావయ్య అన్నారు.. అమ్మా నన్ను మావయ్య అన్నారు.. బావగారూ నన్ను మావగారూ.. అన్నారు’ అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకునే ఈ సీన్‌లో పోసానితో పాటు సమంత, నాగచైతన్యలు ఎమోషన్స్ పండించారు. మొత్తానికి నిడివి తగ్గించుకోడానికి కోయాల్సిన సీన్లు ఇప్పుడు జనాన్ని మళ్ళీ థియేటర్లకి పరుగులు పెట్టిస్తున్నాయి.