హిజ్రా దారుణ హత్య.. లైంగిక వేధింపులే కారణమా..?

తెలంగాణలోని వరంగల్‌ నగరంలో హరిణి అనే హిజ్రా దారుణ హత్యకు గురైంది. అదెలాగంటే.. తనతో సహజీవనం చేయాలంటూ సురేశ్ అనే కారు డ్రైవర్‌ను హరిణి రోజూ వేధిస్తూ ఉండేది. ఈ వేధింపులు తట్టుకోలేక అతడే హిజ్రాను చంపినట్లు సమాచారం అందుతుంది.

కాగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్శిటీ సమీపంలో హరిణి అనే ఓ హిజ్రా దారుణ హత్యకు గురై అలా పడి ఉంది. హరిణి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హిజ్రా హత్య వెనుక సురేశ్ అనే కారు డ్రైవర్ హస్తం ఉండ వచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

హరిణి కొంతకాలంగా సురేశ్‌ను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తనతో సహజీవనం చేయాలని ఆమె చేస్తే ఒత్తిడి భరించలేకే అతడు హరిణిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.