పోర్న్ వీడియోలు చూపిస్తూ నరకం చూపిస్తున్న భర్త 

Horny husband showing porn videos

పోర్న్ వీడియోలు చూపిస్తూ అందులో మాదిరిగా సెక్స్ చేయాలంటూ వేధిస్తున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిందో ఇల్లాలు. పోర్న్ సీన్లలో మాదిరిగా వివిధ భంగిమల్లో సెక్స్ చేయాలంటూ రోజూ భర్త వేధిస్తున్నాడని, మాట వినకపోతే చిత్రహింసలు పెడుతున్నాడంటూ భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శ్రీనగర్ కాలనీలో నివాసముండే రఘు అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. కొత్తలో భార్యతో సఖ్యతగానే ఉన్న రఘు తర్వాత తనలోని వికృత రూపాన్ని బయటపెట్టాడు. పోర్న్ వీడియోలకు బానిసైన రఘు అందులో మాదిరిగా అసహజ రీతిలో సెక్స్ చేయాలని వేధించడం మొదలుపెట్టాడు.

దీనికి ఆమె నిరాకరిస్తుండటంతో విడాకులిచ్చేస్తానని వేధింపులకు గురిచేస్తున్నాడు. తన ఫ్రెండ్స్‌కు దగ్గరకు వెళ్లి కోరిక తీర్చాలంటూ మానసికంగా హింసిస్తున్నాడు. ఈ నెల 26న ఇదే విషయమై భార్యతో గొడవపడిన రఘు ఆమెను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

భర్త కోసం రెండ్రోజులు వేచిచూసిన బాధితురాలు అతడి వేధింపులపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తానొక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నానని, భర్త తన జీతం మొత్తం తీసుకోవడంతో పాటు డెబిట్, క్రెడిట కార్డులు తీసేసుకుని, బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా బలవంతంగా తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.