ఒక ఆపిల్‌లో 100 మిలియన్ల బ్యాక్టీరియా !

100 million bacteria in one apple!

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ కూడా అక్కర్లేదని చెబుతారు. ఆపిల్ పండ్లలో చాలా  పోషకాలు ఉంటాయి. ఆపిల్స్ లో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కానీ 240 గ్రాముల బరువున్న ఆపిల్‌లో 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని తెలుసా?

ఈ బ్యాక్టీరియా కారణంగా ఒక్కోసారి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆపిల్‌ పండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆపిల్ పండ్లను ఆర్గానిక్, సంప్రదాయ పద్ధతుల్లో పండిస్తారు. ఈ రెండింటిలోనూ బ్యాక్టీరియా ఉంటుంది.

ఆపిల్ పండ్లలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా గింజల్లోనే ఉంటుంది. తర్వాత పల్ప్‌లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా రెండు రకాలుగా ఉంటుంది. మన పేగులకు మంచి బ్యాక్టీరియా అవసరం కూడా. ఆర్గానికి ఆపిల్ పండ్లలో పేగులకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆర్గానిక్ ఆపిళ్లలో ఉండే బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఎంతో అవసరం.

ఆర్గానిక్ ఆపిళ్లలో ప్రొబయోటిక్ లాక్టోబసిల్లీ బ్యాక్టీరియా, మెథైలోబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆర్గానిక్ బ్యాక్టీరియాలోని మిగతా భాగాలతో పోలిస్తే తొక్క, కండ భాగంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంప్రదాయ రీతిలో పండించిన ఆపిళ్ల కంటే ఆర్గానిక్ ఆపిల్ పండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.