మిర్యాలగడ ప్రేమ హత్య కేసులో సంచలనం…!

Horrific Murder In Telangana Man Hacked To Death In Front Of Pregnant Wife

వారిద్దరి ప్రేమ అగ్రకులం వాడయినా అమ్మాయి తండ్రి మనసులో పగను పెంచింది. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ జంటను చూస్తుంటే ఒళ్ళంతా చీమలు, జెర్రెల పాకినట్టు ఫీలయ్యేవాడు ఆయన. ఎంత ప్రయత్నించినా కూతురు తన మాట వినకపోవడంతో బయటకు ప్రేమ నటిస్తూనే మనసులో కుట్ర పెంచుకున్నాడు. అల్లుణ్ని అడ్డుతొలగించుకునేందుకు సుపారీ గ్యాంగ్‌ను దించాడు. వారు పక్కా ప్లాన్‌తో రెక్కీ నిర్వహించి యువకుణ్ని హత్య చేశారు. నిన్న మిర్యాలగూడ యోతి ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ హత్య కలకలం రేపుతోంది. మిర్యాలగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు కూతురు అమృత వర్షిని(అగ్ర కులం), పెరుమాళ్ల ప్రణయ్(తక్కువ కులం) ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

murder-father-suphary

బీటెక్‌ చదువుకునే సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొదలైంది. వర్షిణి తల్లిదండ్రులు వైశ్యులు కాగా.. యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. వీరిద్దరి ప్రేమ విషయం వర్షిణి ఇంట్లో తెలియడంతో ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.. అయితే, వర్షిణి మాత్రం ప్రణయ్‌ని వదలిపెట్టలేదు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని హైదరాబాద్‌ పారిపోయారు. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుని ఇక్కడే కాపురం పెట్టారు.. అప్పట్నుంచి వర్షిణి తండ్రి మారుతీరావు నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

వేధింపులు మరింత పెరగడంతో తమకు రక్షణ కల్పించాలంటూ వర్షిణి, ప్రణయ్‌ ఐజీని ఆశ్రయించారు. ఐజీ ఆదేశాలతో ఎస్పీ యువతి, యువకుడి తరపు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత నుంచి మారుతీరావు ప్రవర్తనలో మార్పు వచ్చి కూతురు, అల్లుడితో సఖ్యంగానే ఉంటున్నాడు.. రెగ్యులర్‌గా ఫోన్లు మాట్లాడటం, తరచూ వారిని చూసేందుకు వస్తుండటంతో అంతా సర్దుకుపోయిందని భావించారు. పోలీసులు కూడా కలిసున్నారనే అనుకున్నారు. కానీ, మారుతీరావు ఓ వైపు మంచిగానే నటిస్తూ, మరోవైపు నుంచి తన ప్లాన్‌ అమలుచేశాడు. వారి కదలికలపై నిఘా పెట్టాడు.

miryala-guda-murder

ఇందులో భాగంగానే ఓ కిల్లర్ గ్యాంగ్ కే సుపారీ ఇచ్చి అల్లుణ్ని అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే 10 లక్షలకు బేరం కుదుర్చుకుని ఓ గ్యాంగ్‌ను రంగంలోకి దించాడు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించిన ఈ గ్యాంగ్‌ అదును చూసి ఘాతుకానికి తెగబడింది. ప్రస్తుతం వర్షిణికి ఐదో నెల.. స్థానిక ఆస్పత్రిలో చెకప్‌ చేయించుకునేందుకు వచ్చారు. అప్పటికే మాటు వేసిన గ్యాంగ్‌ ప్రణయ్‌ని వెంబడించింది.. కిల్లర్‌ వెనుక నుంచి కత్తితో నరికాడు. ఆ వేటుకు ప్రణయ్‌ కుప్పకూలిపోయాడు.. ఆ వెంటనే మరో రెండుసార్లు నరికి కత్తిని వదిలి సుపారీ కిల్లర్‌ అక్కడ్నుంచి పారిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్‌ అయింది. ప్రణయ్‌ హత్యకు గురయ్యాడని తెలియగానే వర్షిణి తండ్రి మారుతీరావు సూర్యారావు పేట మీదుగా హైద్రాబాద్ పరారయ్యాడు. అటు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నారు.

murder-wife-father