పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి తగ్గాలంటే….

పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి తగ్గాలంటే....

పర్సనల్ కేర్ అనేది చాలా ముఖ్యం. అందంగా ఉండడం, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే ప్రతి ఒక్కరూ ఈ విధంగా అనుసరిస్తే తప్పకుండా అందంగా ఉండొచ్చు మరియు శుభ్రంగా ఉండొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం.సాధారణంగా మనం స్పా కి వెళ్ళినప్పుడు వివిధ రకాల పద్ధతులని అనుసరిస్తూ ఉంటారు అయితే ఇంట్లోనే మనం ఆ విధంగా తయారు చేసుకోవచ్చు.

గోరు వెచ్చని నీళ్ళలో కాసేపు ఉండి. ఆ తర్వాత బాడీ వాష్ చేసుకుంటే బాగుంటుంది. బాడీ ని వాష్ చేసేటప్పుడు మంచి సువాసన నూనె సువాసనలిచ్చే సబ్బులు వంటివి ఉపయోగించ వచ్చు. ఇలా చేయడం వల్ల అందంతో పాటు మీ మనసు ఎంతో ప్రశాంతంగా, మజిల్స్ ఎంతో రిలాక్స్ గా ఉంటాయి కాబట్టి తప్పకుండా రెగ్యులర్ గా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి.అదే విధంగా ఇది కూడా చాలా ముఖ్యం.

ఎప్పుడూ కూడా ముఖాన్ని అందంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మేకప్‌ని శుభ్రంగా తొలగించాలి. మేకప్ రిమూవల్ లేదా వైప్స్ సహాయంతో మేకప్‌ని తొలగించుకోవాలి. ఆ తర్వాత cleanser ని ఉపయోగించండి అది అయిపోయిన తర్వాత ఎక్స్ఫోలియెట్ చేసి మృత కణాలను తొలగించండి. ఇలా ఈ విధంగా చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి దీంతో చర్మం అందంగా ఉంటుంది ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది.

రోజంతా మనం వివిధ పనులు చేస్తూ ఉంటాము. అయితే ఇలా పనులు చేయడం వల్ల దుమ్ము ధూళి వంటివి తగులుతూనే ఉంటాయి. ముఖ్యంగా నడవడం వల్ల కళ్ళల్లో మట్టి ఎక్కువ చేరిపోతుంది. పాదాలని సాధారణంగా మనం సబ్బుతో రుద్దితే మట్టి పోదు. అందుకనే చక్కగా గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దానిలో పాదాలు ఉంచడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఆ పద్ధతి గురించి చూస్తే… గోరు వెచ్చని నీళ్ళు తీసుకుని అందులో కొంచెం ఎప్సం సాల్ట్ వేయండి.

ఆ తర్వాత కొద్దీ సేపు పాదాలని అందులో నాననివ్వండి. ఇది చక్కటి ప్రయోజనాన్ని ఇస్తుంది. పూర్వ కాలం నుండి కూడా ఈ పద్ధతిని చాలా మంది అనుసరిస్తున్నారు. పాదాలలో చేరే దుమ్ము ధూళి వంటి వాటిని ఇది తొలగిస్తుంది. అలానే మజిల్స్‌ని కూడా ఇది సాఫ్ట్‌గా ఉంచుతుంది. కనుక ఈ విధంగా కూడా రెగ్యులర్‌గా మీరు ఫాలో అవ్వండి. దీనితో కూడా మీరు చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు.

ఎక్కువ సేపు కంప్యూటర్, ల్యాప్టాప్ లేదా మొబైల్ ఫోన్స్ స్క్రీన్స్ ముందు గడపడం వల్ల కళ్ళు నొప్పి పుడతాయి. అది కాకుండా డార్క్ సర్కిల్స్, నిద్రలేక పోవడం లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కనుక కంటికి మసాజ్ చాలా అవసరం. cooling eye orbit or an eye massager సహాయంతో మీరు కంటి సమస్యలను తొలగించొచ్చు. డార్క్ సర్కిల్స్ వంటివి కూడా పోతాయి. ఇలా రెగ్యులర్ గా ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.

సహజ సిద్ధమైన పదార్థాలతో టీ తీసుకుంటే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. ముఖ్యంగా అశ్వగంధ, లెమన్ గ్రాస్, చమోలి టీ, మింట్ మంచి ఫలితాలను ఇస్తాయి. అనారోగ్య సమస్యలని తరిమికొట్టడానికి అజీర్తి సమస్యను పోగొట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. కనుక ప్రతి రోజూ ఈ విధంగా ఫాలో అయితే తప్పకుండా ఆరోగ్యం మరింత బాగుంటుంది.

అయితే ఈ టీల వలన ఎలాంటి ప్రయోజనాలని మనం పొందొచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ఆయుర్వేద గుణాలు వుండే ఈ టీలని తాగడం వల్ల ఒత్తిడి దూరం అయ్యిపోయి ఎంతో రిలాక్స్ గా ఉంటుంది. అంతే కాకుండా జ్వరం, జలుబు, ఫ్లూ వంటివి ఉన్నప్పుడు వీటిని కనుక తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. పిసిఓఎస్, పీసిఒడి సమస్యని కూడా ఈ టీలతో తగ్గించుకోవచ్చు.

ఇక చమోలీ టీ గురించి చూస్తే.. ఈ టీ తాగడం వలన అదిరే లాభాలు కలుగుతాయి. అలానే ఎంతో రిలాక్స్ గా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. పీసీఓస్, పీసీఓడీ తో బాధపడే మహిళలు చమోలి టీ తాగితే చక్కటి రిలీఫ్ ఉంటుంది. అదే విధంగా ఇది యాంగ్జైటీని కూడా దూరం చేస్తుంది. లావెండర్ కూడా చక్కటి లాభాల్ని ఇస్తుంది.

కొంత మంది మహిళలకి పీరియడ్స్ సమయంలో రాత్రి పూట కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది. దీనితో నిద్ర అస్సలు నిద్ర పట్టదు. అలాంటి సమయంలో ఈ లావెండర్ టీ కనుక తాగితే మంచి రిలీఫ్ ఉంటుంది. ఏ ఒత్తిడి లేకుండా రిలాక్స్ గా ఉంచుతుంది.అలానే తులసి, అల్లం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటితో టీ చేసుకుంటే బాగుంటుంది.

అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అదే విధంగా ఇది వికారాన్ని పోగొడుతుంది. ఇలా దీనితో కూడా మంచిగా లాభాలు పొందొచ్చు. దాల్చిని, పెప్పర్ మింట్ కూడా మంచిగా సహాయం చేస్తాయి. పెప్పెర్ మింట్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. అలానే పెప్పెర్ మింట్ టీ ని రోజు తీసుకుంటే జీర్ణ సమస్యలని కూడా ఇది తొలగిస్తుంది. ఇలా రెగ్యులర్ గా ఈ చిన్న చిన్న పద్ధతులని అనుసరిస్తే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.