అనుమానంతో భార్య ముక్కు కొరికేసిన భర్త…!

Husband bites his wifes nose

క్షణికావేశం విచక్షణ జ్ఞానాన్ని చంపేసి ఏమి చేస్తున్నామో కూడా తెలీకుండా చేస్తుంది. దానికి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా, పల్హోరా గ్రామంలో జరిగిన దారుణ ఘటనే సాక్ష్యం. భార్య తనకు చెప్పకుండా ఊరు వెళ్లిందన్న కోపంతో ఉన్న భర్త తన భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. అందుతున్న సమాచారం మేరకు అర్జున్, గీతా దంపతులు.

 Husband bites his wifes nose

గీత (32) ఐదు రోజుల క్రితం తన భర్త అర్జున్‌కు చెప్పకుండా బరేలీకి వెళ్లింది తన అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లావంటూ గీతను అర్జున్ నిలదీశాడు. అయితే ఆమె సమాధానమివ్వకపోవడంతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో రగిలిపోతూ గీతపై దాడి చేసి ముక్కును కొరికాడు. సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసి, గీతను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.