రానా ఎల్టీటీఈ : ఫస్ట్ లుక్

Rana LTTE First Look

బాహుబలిలో ప్రతినాయకుడిగా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు. ఇప్పటికే తెలుగు తమిళం హిందీ సినిమాల్లో నటించిన రానా తాజాగా కన్నడ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తోంది. కన్నడ డైరెక్టర్ రమేష్ దర్శకత్వంలో ‘ఎల్ టీ టీ ఈ’ ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం’. శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక దేశం కావాలని హింసాయుత పోరాటం చేసిన సంస్థకు సంబందించిన విషయాల మీద తీస్తున్న సినిమా లో రానాని ఒక పాత్రకు తీసుకున్నారని తెలుస్తోంది. నిన్ననే ఆ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో శ్రీలంక మ్యాప్ తో పాటు ఎరుపు – నలుపు లో డిజైన్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. సో ఈ సినిమాతో రానా కన్నడ చిత్ర సీమలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడన్నమాట.

rana-daggubati