దేశంలో మూడు,విశ్వవ్యాప్తంగా అరవైఏడు

దేశంలో మూడు,విశ్వవ్యాప్తంగా అరవైఏడు

టాప్‌100 స్మార్ట్‌నగరాల జాబితా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ జాబితాలో గ్రేటర్‌ హైదరాబాద్‌ విశ్వవ్యాప్తంగా 67వ ర్యాంకులో, దేశంలో మొదటి స్తానంలో ఉంది.దేశ రాజధాని ఢిల్లీకి 68వస్థానంఇంకా ముంబై కి 78వ స్థానం లభించింది.విశ్వవ్యాప్తంగా మొదటిస్తానంలో సింగపూర్‌ నిలిచింది. రెండోస్థానంలో జూరిచ్,మూడోస్థానంలో ఓస్లో,నాలుగోస్థానంలో జెనీవా, ఐదో స్థానంలో కొపెన్‌హెగెన్‌ నగరాలు ఉన్నాయి.

పౌరులకు అందిస్తున్న ఆన్‌లైన్‌సేవలు, నల్లాబిల్లులు, పారిశుద్ధ్యం, ఇంటిపన్నులు, ఇతర సమస్యలపై ఆన్‌లైన్‌ ఫిర్యాదుల స్వీకరణ-పరిష్కరణ ,అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంకా స్మార్ట్‌టెక్నాలజీ వినియోగం, పౌరులకు అందుతున్న సేవలను తీసుకొని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్, సింగపూర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ సంస్థలు దాదాపు 102 నగరాలపై అధ్యయనం చేసి ర్యాంక్లని వెల్లడించాయి.