నాని నట విశ్వరూపం, మూడు తరాల పాత్రల్లో..!

In Jersey Movie NANI Will Appear In The Role Of Three Different Generations

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్‌ హీరోల్లో సొంత ట్యాలెంట్‌తో వచ్చిన హీరోలు చాలా తక్కువ మంది. అందులో నాని ముందు వరుసలో ఉంటాడు. నాని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా పరిచయం అయ్యాడు. నాని నటనతో ఈ స్థాయికి చేరుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సహజ నటుడిగా పేరున్న నాని ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. నాని నటన విశ్వరూపం ఇప్పటికే పలు చిత్రాల్లో చూపించాడు. ఇప్పుడు గౌతమ్‌ దర్శకత్వంలో చేయబోతున్న ‘జెర్సీ’ చిత్రంలో కూడా చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. జెర్సీ చిత్రంలో మూడు విభిన్న తరాలకు చెందిన పాత్రలో కనిపించబోతున్నాడు.

In Jersey Movie  NANI Will Appear In The Role Of Three Different Generations

‘జెర్సీ’ చిత్రంలో నాని క్రికెటర్‌గా నటిస్తున్న విషయం ఇప్పటికే ఖరారు అయ్యింది. ఈ చిత్రంలో మూడు వయస్సుల వ్యక్తిగా కనిపించబోతున్నాడు. టీనేజ్‌, యంగ్‌ ఏజ్‌, 40 ఏళ్లు పూర్తి చేసుకున్న వ్యక్తి పాత్రలో నాని కనిపించబోతున్నాడు. ఒకే పాత్ర అయినా కూడా మూడు వేరియేషన్స్‌లో దర్శకుడు నానిని చూపించబోతున్నాడు. క్రికెట్‌ అంటే ఇష్టంతో టీనేజ్‌లో చదువును అశ్రద్ద చేసి, యంగ్‌ ఏజ్‌లో కెరీర్‌ను నాశనం చేసుకున్న వ్యక్తి 40 ఏళ్ల తర్వాత ఆ క్రికెట్‌లో ఏం సాధించాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి సినిమా చాలా విభిన్నంగా, నానిలోని నట విశ్వరూపంను చూపించే విధంగా ఉంటుందని సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రంను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

In Jersey Movie  NANI Will Appear In The Role Of Three Different Generations