తెలంగాణ రాజకీయాల్లో బీసీలదే హవా..బి‌సిలకు దక్కని రాజ్యాధికారం..!

In Telangana politics, BCs are the wind.
In Telangana politics, BCs are the wind.

తెలంగాణ రాజకీయాల్లో బీసీలదే హవా అని చెప్పవచ్చు. వారికే గెలుపోటములని శాసించే సత్తా ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అందులో ముదిరాజ్‌ల వర్గం ముఖ్యమైన పాత్ర. అయితే గెలిపించేది బి‌సిలు గాని..వారికి మాత్రం రాజ్యాధికారం దక్కడం లేదు. ఇదే సమయంలో ఇంతకాలం అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తూ వస్తున్న ముదిరాజ్ వర్గానికి సరైన న్యాయం జరగడం లేదు. ఏళ్ల తరబడి వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా బీసీ-డి నుంచి బీసీ-ఏ జాబితాలో చేర్చాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.

కానీ కే‌సి‌ఆర్ ప్రభుత్వం ఆ డిమాండ్‌ని పట్టించుకోవడం లేదు. అయితే ఈటల రాజేందర్ బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చాక బి‌ఆర్‌ఎస్ లో ఇంకా ముదిరాజ్‌ వర్గానికి చెందిన నాయకులకు కీలక పదవులు ఏమి దక్కలేదు. ఇటీవల కే‌సి‌ఆర్ బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని కూడా ప్రకటించారు. కానీ ఒక్క సీటు కూడా ముదిరాజ్ వర్గానికి కేటాయించలేదు. దీంతో ఆ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. తెలంగాణలో అత్యధిక ఓట్లు ముదిరాజ్ వర్గానికి ఉన్నాయి. కానీ వారికి ఒక్క సీటు ఇవ్వలేదు. ఈ క్రమంలో ముదిరాజ్‌లంతా ఐక్యమయ్యారు.