ఇటలీలో చిక్కుకున్న భారతీయులు

ఇటలీలో చిక్కుకున్న భారతీయులు

చైనాతో తర్వాత అత్కంత ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం ఇటలీ. ఇక్కడ ఇప్పటికే 36శాతం మరణాలు కరోనా వల్లే జరిగాయి. 631మంది మరణించారు. చైనా ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చింది. అయితే ఇటలీ నుంచి మాత్రం భారతీయులను తరలించలేదు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయులు తెలుగు వారు ఇప్పుడు ఆందోళనతో రక్షించండి అంటూ వీడియో సందేశం పంపుతున్నారు.

ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్ ధాటికి తెలుగు విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. భారత్ కు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నా.. ఇటలీలో అందరినీ గృహనిర్భందంలో ఉండాలని బయట తిరగవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక విమానాశ్రయంలో ఇరుక్కుపోయిన తెలుగు విద్యార్థులను భారత్ కు తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని వారంతా వీడియోలో ప్రభుత్వాన్ని కోరారు. తామంతా ఇటలీలోని మిలాన్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయినట్లు తెలిపారు. నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయని.. తమను తీసుకెళ్లాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.