హీరో అవుతున్న బాల‌న‌టుడు

child artist teja turned into hero
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా చూసిన‌వాళ్లెవ్వ‌రూ ఆ సినిమాలోని బాల న‌టుడు తేజ‌ను మర్చిపోలేరు. ఇంద్ర సినిమాతో తేజకు ఎంతో గుర్తింపు ల‌భించింది. ఇంద్ర‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో తేజ బాల‌న‌టుడిగా అల‌రించాడు. చూడాల‌ని ఉంది, యువ‌రాజు, వ‌సంతం, శ్రీరామ‌దాసు లాంటి సినిమాల‌తో మెప్పించిన తేజ త‌ర్వాత వెండితెర‌కు దూర‌మ‌య్యాడు. ప‌న్నెండేళ్ల క్రితం శ్రీరామ‌దాసులో న‌టించిన బాల తేజ ఇప్పుడు పెరిగి పెద్ద‌యి యువ‌కుడ‌య్యాడు. బాలన‌టుడు హీరోగా టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. తేజ ప్ర‌శాంత వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా ప‌రిచ‌యం అవుతాడ‌న్న వార్త‌లు గ‌తంలో వినిపించ‌గా..ఇప్పుడు మ‌రో వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. బాల‌న‌టుడిగా అల‌రించిన తేజ ఇప్పుడు యువ‌కుడిగా త‌న వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు ఓ ల‌వ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడని ఫిలింన‌గర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. మిణుగురులు సినిమా డైరెక్ట‌ర్ అయోధ్య‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తేజ హీరోగా ప‌రిచ‌యం కానున్నాడు. తేజ స‌ర‌స‌న హెబ్బా ప‌టేల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే చిత్ర‌యూనిట్ దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నుంది.