బ్రిట‌న్ మంత్రివ‌ర్గంలో నారాయ‌ణ మూర్తి అల్లుడు

Theresa May appoints to Rishi Sunak as Britain Minister

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు నారాయ‌ణ మూర్తి అల్లుడు రిషి సున‌క్ బ్రిట‌న్ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్నారు. ఆంత‌రంగిక మంత్రులు, కార్య‌ద‌ర్శుల బృందంలో చేసిన మార్పుల్లో భాగంగా బ్రిట‌న్ ప్ర‌ధాని థెరెసా మే రిషి సున‌క్ కు కీల‌క‌శాఖ అప్ప‌గించారు. స్థానిక ప్ర‌భుత్వం, క‌మ్యూనిటీస్, హౌసింగ్ మంత్రిత్వ‌శాఖ‌లో అండ‌ర్ సెక్ర‌ట‌రీ స్టేట్ గా రిషి సునాక్ ను నియమించిన‌ట్టు బ్రిట‌న్ ప్ర‌ధాని కార్యాల‌యం ట్వీట్ చేసింది. ఈ సారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మ‌హిళ‌ల‌కు, వ‌ల‌స‌దారుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

Rishi Sunak family

36 ఏళ్ల రిషి 2015లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నార్త్ యార్క్ షైర్ లోని రిచ్ మండ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆక్స్ ఫ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో డిగ్రీ పూర్తిచేసిన ఆయ‌న లండ‌న్ లో ఓ పెట్టుబ‌డి సంస్థ‌ను స్థాపించారు. స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్ లో కో స్టూడెండ్ అయిన నారాయ‌ణ మూర్తి కుమార్తె అక్ష‌తామూర్తిని పెళ్లిచేసుకున్నారు. వారికి కృష్ణ‌, అనౌష్క అనే ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. 2014లో రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు.