అజ్ఞాతవాసిలో వెంకీ లేడు.. ప్లాన్‌ రివర్స్‌

venkatesh did not appeared in agnathavasi
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే నేడు సినిమా మొదటి ఆట చూసిన ప్రేక్షకులు వెంకటేష్‌ ఇంకా ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూశారు. ప్రత్యేకంగా వెంకటేష్‌కు కృతజ్ఞతలు అంటూ టైటిల్‌ కార్డ్స్‌లో వేయడంతో ఖచ్చితంగా వెంకీ ఉంటాడని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. అయిదు నిమిషాల పాటు వెంకీ సందడి చేస్తాడంటూ మొదటి నుండి టాక్‌ వినిపించింది.

పవన్‌ కళ్యాణ్‌తో గతంలో గోపాల గోపాల చిత్రాన్ని చేసిన వెంకీ ఈ చిత్రంలో పవన్‌ కోసం గెస్ట్‌ రోల్‌ చేశాడు. కాని వెంకీ నటించిన సీన్స్‌ను తొలగించడంతో ఫ్యాన్స్‌ కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం వెంకటేష్‌ సీన్స్‌ను ఉద్దేశ పూర్వకంగా తొలగించడం జరిగిందని, ఆ సీన్స్‌ను రెండవ వారంలో జత చేయాలని భావిస్తున్నారు. అలా చేయడం వల్ల రిపీట్‌ ఆడియన్స్‌తో కలెక్షన్స్‌ మరింతగా వచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్‌ సభ్యుల ప్లాన్‌గా తెలుస్తోంది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో వెంటనే వెంకటేష్‌ సీన్స్‌ను యాడ్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండవ వారంకు సినిమా పూర్తిగా డల్‌ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంకీ సీన్స్‌ను జత చేసినా కూడా ఫలితం ఉండక పోవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం.