పుష్ప 3 పై ఇంట్రెస్టింగ్ న్యూస్ !

Interesting news on Pushpa 3!
Interesting news on Pushpa 3!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప ది రైజ్. ఈ మూవీ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబట్టడం జరిగింది. ఈ మూవీ కి సంబందించిన సీక్వెల్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు పుష్ప టీమ్.

లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ఏమిటంటే, ఈ మూవీ కి కూడా సీక్వెల్ ఉండనుంది. పుష్ప 3 కి సంబందించిన కొన్ని సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ పుష్ప 3 ని వచ్చే ఏడాది సమ్మర్ కకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కూడా త్వరలో క్లారిటీ రానున్నది .

Interesting news on Pushpa 3!
Interesting news on Pushpa 3!

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.