సాహో నుండి ఇంటరెస్టింగ్ అప్డేట్ !

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేం సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ నటిస్తుంది. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసి మరో స్టార్‌ కూడా సందడి చేయనున్నారట. ఈ చిత్రంలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు సల్మాన్‌తో సంప్రదింపులు జరిపారట. దీనికి సల్మాన్ కూడా దాదాపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోన్న ప్రచారం. సాహోలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, సల్మాన్‌ స్నేహితులు. వీరిద్దరూ కలిసి ప్రేమరతన్ ధన పాయో అనే సినిమా చేశారు, ఈ సినిమా చేసిన సమయమ్లో ఏర్పడిన స్నేహం వీరి మధ్య బలంగా ఉందట. అందుకే సల్మాన్ ని ఈ సినిమా కోసం ఒప్పించే బాధ్యతను తీసుకున్న నీల్ నితిం ఇందులో అతిథి పాత్ర గురించి సల్మాన్‌కు ముఖేష్‌ వివరించారట. ఆయన కూడా ఒప్పుకున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఒకవేళ సల్మాన్‌ నిజంగా ఇందులో నటిస్తే గనుక సినిమాకు హిందీలోనూ మంచి మార్కెట్‌ ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది. ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చిత్రం విడుదల కాబోతోంది.