తగ్గిన ఐఫోన్ ధరలు

తగ్గిన ఐఫోన్ ధరలు

యాపిల్ ఐఫోన్ వాడాలన్నది చాలామంది కల. కానీ ఈ స్మార్ట్ ఫోన్ భారీ ధరను చూసి కొందరు కొనుగోలుకు వెనక్కితగ్గుతారు. ధరను చూసి ఐఫోన్‌కి దూరంగా ఉన్న వాళ్ల కోసం యాపిల్ కొన్ని ఆఫర్లు తీసుకొచ్చింది. వీటిని యూజ్ చేసుకుంటే రూ.60 వేల కంటే తక్కువ మొత్తానికే యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ వేరియంట్లను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ వాడాలనే కలను నెరవేర్చుకోవచ్చు.

యాపిల్ సంస్థ 2021 ఏడాదికి గానూ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ సిరీస్‌లో ఐఫోన్ 13ను ఇటీవల లాంచ్ చేసింది. ఈ ఫోన్లకు సంబంధించిన పలు వేరియంట్ల సేల్స్ కూడా శుక్రవారం నుంచి ఇండియాలో మొదలయ్యాయి.అంతకముందు సెప్టెంబర్ 14న జరిగిన ఈవెంట్‌లో ఐఫోన్ 13 సిరీస్‌ని లాంచ్ చేశారు. 17వ తేదీ నుంచి ఇండియాప్రి బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.

ఐఫోన్ 12 సిరీస్ మాదిరిగానే ఈ కొత్త సిరీస్లో కూడా నాలుగు మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐ ఫోన్ 13 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ని యాపిల్ లాంచ్ చేసింది. ఈ నాలుగు మోడల్స్ లాంచింగ్ ధరలు కూడా ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల ధరల మాదిరిగానే ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 13 మినీ ధర రూ.69,900 నుంచి మొదలవుతుంది. ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ.79,900 కాగా, ఐఫోన్ 13 ప్రో రూ.1,19,900 నుంచి మొదలవుతుంది. ఇక, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,29,900గా ఉంది.

ఐఫోన్ 13 సిరీస్‌ని కస్టమర్లకు చేరువ చేసేందుకు యాపిల్ సంస్థ కొన్ని ఆఫర్లు ప్రకటించింది. ఒక వేళ మీరు ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్లు ముందే తెలుసుకుంటే చాలా లాభం దక్కనుంది. ఇండియాలోని యాపిల్‌కి చెందిన ఐస్టోర్ రిటెయిల్ చైన్స్, వెబ్‌సైట్స్ ద్వారా 13 సిరీస్ ఫోన్లను అత్యల్పంగా రూ.45,900 నుంచే సొంతం చేసుకోవచ్చు.

ఆఫర్ కింద ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ.15,‌‌0‌ 00, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.3000 తగ్గనుంది. దీంతో పాటు రూ. 6000 వరకు అదనపు క్యాష్ బ్యాక్‌గా అందుతుంది. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 బేసిక్ వేరియంట్లు కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అంతేకాక రూ.3329 కనీస వాయిదా చెల్లించే విధంగా హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

యాపిల్ ఐఫోన్ 13 కొనుగోలు దారుల కోసం ఫ్లిప్‌కార్ట్ కూడా కొన్ని ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు కొనుగోలు చేసే వారు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే చెల్లించిన మొత్తంలో 5 శాతం ఇన్స్టెంట్ క్యాష్‌బ్యాక్‌గా వస్తుంది. అయితే, ఐపీఎల్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్లోని 512 జీబీ వేరియంట్స్ మాత్రమే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇతర మోడల్స్ సోల్డ్ ఔట్ అని చూపిస్తోంది.

యాపిల్ ఐఫోన్ మినీలోని అన్ని వేరియంట్స్ ఈ సైట్లో ఉన్నాయి.ఎక్స్చేంజ్ డిస్కౌంట్స్ మినహా యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లపై అమెజాన్ ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు పెట్టలేదు. అంతేకాక యాపిల్ ఐఫోన్ 13 మినీలోని అన్ని వేరియంట్స్ మాత్రమే అమెజాన్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. 13 సిరీస్లోని ఇతర మోడల్స్‌కి సంబంధించిన ఏ వేరియంట్ కూడా అమెజాన్లో ప్రస్తుతం స్టాక్ లేదు.