ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నాడా..?

is pavan kalyan again cameback into movies

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నాడని, ఆయన ఇంకో సినిమా చేయ‌బోతున్నాడని ప్రచారం మొదలయ్యింది. అదేంటి ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనుకుంటున్నారా నిజానికి ఆయన లుక్ చూసిన త‌ర్వాత ఇలాంటి డౌట్స్ వ‌స్తున్నాయ్ అంతే. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు గ‌డ్డంతో మునిలా క‌నిపించిన ఈయ‌న‌ చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ హీరోగా మారిపోయాడు. ఓ పాప‌తో దిగిన ఫోటో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతుంది. ఇందులో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుర్తుకు రావ‌డం లేదు ఒక‌ప్పుడు సినిమా హీరో గుర్తుకొస్తున్నాడు. త‌ను సినిమాలు చేయ‌న‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా కూడా ఇప్పుడు లుక్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా ఏదో ఓ సినిమా అయితే క‌చ్చితంగా చేస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా ఈయ‌న కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అజ్ఞాత‌వాసి త‌ర్వాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలు వ‌చ్చాయంటూ వార్త‌లొచ్చాయి. కానీ తాము ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మంచి స్నేహితుల‌మే అని ఆ మ‌ధ్య ఓ వేడుక‌లో నిరూపించారు ఈ ఇద్ద‌రు. ఇదిలా ఉంటే 2020లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తోనే రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తుంది. దానికి తోడు ప‌వ‌న్ సినిమా క‌చ్చితంగా ఉంటుంద‌ని ఆయన అడ్వాన్స్ కూడా తీసుకున్నారని మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా క‌చ్చితంగా చెబుతున్నారు. ఆయన మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని చెప్పాడు. ఈ క‌న్ఫ్యూజ‌న్ లో అస‌లు ఈయ‌న సినిమాలు చేస్తాడా చేయ‌డా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.