సంక్రాంతి కి “ఆర్ఆర్ఆర్” మూవీ లేనట్లేనా ?

క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా సినీ ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. లాక్‌డౌన్ తో సినిమాల షూటింగ్స్ అన్ని ఆపేయడంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియకుండా పోయింది. దర్శకనిర్మాతలు పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటించి ఆ దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలో సడెన్ గా ఈ కరోనా మహమ్మారి వచ్చి సినిమా ఇండస్ట్రీని స్తంభింప చేసేసింది. దాంతో సినిమాలన్ని పోస్ట్ ఫోన్ అవుతున్నాయని సోషల్ మీడియాలో అనేక రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ వచ్చే ఏడాది జనవరి 8న నుండి మళ్ళీ మారే అవకాశం ఉందని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా 2021 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా రెండు మూడు నెలలు గ్యాప్ రావడంతో మేకింగ్ కు మరో రెండు నెలలు టైం కావాలి అట. అందుకే రిలీజ్ డేట్ మారుతున్నట్లు తెలుస్తోంది.

‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.