OG సినిమా కోసం విలన్ గా ఆ స్టార్ హీరోనేనా ?

OG సినిమా కోసం విలన్ గా ఆ స్టార్ హీరోనేనా ?
OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి OG సినిమా పంజా మూవీ ని గుర్తు చేసేలా ఉంది అని చెప్పవచ్చు. ముంబై బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ ని సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . OG సినిమా పైన అభిమానులకి ఇటు ప్రేక్షకులకి అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి అని చెప్పొచు. ఒక రెంజ్ లో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేలా కనిపిస్తున్నారు

మేకర్స్. షూటింగ్ అప్డేట్స్, లొకేషన్ అప్డేట్స్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి చిన్న సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ అందిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ‘OG’ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అయితే అతన్ని ఫేస్ చేసే ప్రతినాయకుడు ఎలా ఉండాలి మరీ. టాలీవుడ్ ఇండస్ట్రీ చూసిన ఒక బెంచ్ మార్క్ క్యారెక్టర్ లా ఉండాలి. అందుకే ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ సుజిత్ ఓ బాలీవుడ్ హీరోని సంప్రదిస్తున్నట్టు సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్ల ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోలైన టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా పేర్లు OG విలన్ లిస్టులో ఉన్నాయి.