జగన్ ది పొలిటికల్ ఇంద్ర.

jagan mohan decide has been taken a special helicopter to come on cbi court

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అసలే వరస అపజయాలతో ఉసూరుమంటున్న వైసీపీ అధినేత జగన్ ని ఇక పొలిటికల్ ఇంద్ర అవతారం ఎత్తబోతున్నాడు. శుక్రవారం కోర్టుకి రావాల్సిందే అని వచ్చిన తీర్పుని దృష్టిలో ఉంచుకుని ఇదేదో ఎకసెక్కానికి అంటున్న మాట కాదు. నిజంగా నిజం. ఇంద్ర అంటే పాలనాపరం అనుకోవద్దు. అప్పుడెప్పుడో సూపర్ డూపర్ హిట్ అయిన మెగా స్టార్ మూవీ లో హెలికాఫ్టర్ సీన్ ఎంత హైలైట్ అయ్యిందో తెలిసిందే. వారణాసి నుంచి అప్పటికప్పుడు రాయలసీమ రావడానికి ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ హెలికాఫ్టర్ లో వచ్చి సొంత గడ్డని ముద్దు పెట్టుకునే సీన్ జనాన్ని ఫ్లాట్ చేసేసింది.

శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకి రావాల్సిన జగన్ కూడా పాదయాత్ర కి ఆ రోజు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. అయితే రోడ్డు మార్గంలో ఈ ప్రయాణం చేసి తిరిగి పాదయాత్ర చేయడం అంటే కష్టం అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ శుక్రవారం హైదరాబాద్ కి కోర్టుకి వచ్చేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్ వాడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వివిధ బహిరంగ సభల్లో పాల్గోడానికి పెద్ద స్థాయి నేతలు హెలికాఫ్టర్ వాడడం సహజమే. అయితే కోర్టు కేసుకి ఇలా వెళ్లడం కాస్త చిత్రమే. అయినా పరిస్థితులు జగన్ ని ఆ దిశగా నడిపిస్తున్నాయి. అందుకే జగన్ ఈ పాదయాత్ర టైం లో పదేపదే హెలికాఫ్టర్ లో తిరిగి ది పొలిటికల్ ఇంద్ర అనిపించుకుంటాడేమో.