పేర్నిపై ఏపీ మంత్రి ఫైర్…

YSRCP చెందిన వ్యక్తి చనిపోతే కూటమి ప్రభుత్వం పతనం అవుతుందన్న మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యలపై మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. తమ పార్టీలోని వ్యక్తులు చనిపోయినా పర్వాలేదు అనుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మనుష్యులు చనిపోవాలని మాజీ మంత్రి మూర్కంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తి చనిపోవాలని కోరుకుంటున్నారా.. వ్యక్తి చనిపోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారా అంటూ నిలదీశారు. ఏది పడితే మాట్లాడితే చెల్లదన్నారు.