థియేటర్ల బంద్ వివాదం నేపథ్యంలో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి అత్తి సత్యనారాయణను తొలగించింది. థియేటర్ బంద్ వెనక సత్యనారాయణ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిజానిజాలు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది.