సీఎంగారూ.. తులం బంగారం ఎక్కడ..?

ఆడపడుచుల వివాహానికి ఇస్తామన్న తులం బంగారం హామీ ఏమైందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలానగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో మండలానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకు KCR ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ఎంతో మందికి ఆసరాగా నిలిచిందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.