తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు అమెరికాలో చుక్కెదురైంది. రాజకీయ కక్షలో భాగంగా తనపై కేసులు పెట్టారంటూ అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ వేయగా.. అమెరికా ప్రభుత్వం దానిని తోసిపుచ్చింది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే జూన్ 20లోగా కోర్టులో హాజరుకావాలంటూ ప్రభాకర్ రావుకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రావు పోలీసు విచారణకు హాజరుకానందున ఆయనను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.